ఎనిమిదేళ్లలో రూ.25వేల కోట్లు! సాథించిన ఇంజనీరింగ్ విధ్యార్ది.ఎలాగో మీరే చూడండి.

ఎనిమిదేళ్లలో రూ.25వేల కోట్లు! 
kumar,06/02/2017                                            


21 ఏళ్ల వయసులో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి అందరిలానే భవిష్యత్తు పైన బోలెడన్ని ఆశలతో జ్యోతి బన్సల్‌ అమెరికాలో అడుగుపెట్టాడు. కానీ కొందరికే 
సాధ్యమయ్యేలా అక్కడే ఓ కంపెనీని స్థాపించి ఎనిమిదేళ్లలో దాన్ని ఏకంగా పాతిక వేల కోట్ల రూపాయలకు ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థ ‘సిస్కో’కి అమ్మేశాడు. అలా... మనలో టాలెంట్‌ ఉంటే ఏ చోటైనా ఒకటేనని మరోసారి నిరూపించాడు.
మెరికాలో చదువుకోవాలీ, అక్కడికెళ్లి ఉద్యోగం చేయాలీ... సాధారణంగా మన దేశంలో విద్యార్థుల డాలర్‌ కలలు ఇలానే ఉంటాయి. కానీ పదహారేళ్లక్రితం ఇంజినీరింగ్‌ చదివే రోజుల్లో స్నేహితులంతా ఐదంకెల జీతమిచ్చే సంస్థల్లో ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడుతుంటే, జ్యోతి బన్సల్‌ మాత్రం అలాంటి కంపెనీని పెడతానని చెప్పేవాడు.
బన్సల్‌ స్వస్థలం రాజస్థాన్‌లోని అజ్మీర్‌ నగరం. తండ్రి వ్యవసాయ పనిముట్లను అమ్మే వ్యాపారం చేసేవాడు. చదువులో చురుగ్గా ఉండే బన్సల్‌ వారాంతాల్లో తండ్రి దుకాణంలో గడుపుతూ వ్యాపార మెలకువల్ని ఒంటబట్టించుకున్నాడు. ఇంటర్‌ పూర్తయ్యే నాటికి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ రంగం రాకెట్‌ వేగంతో దూసుకెళ్తూ ఉద్యోగులకూ, యజమానులకూ కోట్లు కురిపిస్తోందని గ్రహించాడు. ఆ దేశానికి వెళ్లడమే లక్ష్యంగా దిల్లీ ఐఐటీలో ఇంజినీరింగ్‌ సీటు సంపాదించి, కంప్యూటర్‌ నైపుణ్యం పెంచుకునే పనిలో పడ్డాడు.
ఐఐటీలో చదువు పూర్తయ్యే నాటికి సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లూ, కోడ్‌లూ రాయడంలో పట్టు తెచ్చుకొని, తన నైపుణ్యంతో ఇన్వెస్టర్లను ఆకర్షించి సాఫ్ట్‌వేర్‌ సంస్థను నెలకొల్పే ఉద్దేశంతో బన్సల్‌ అమెరికా బయల్దేరాడు. కానీ అక్కడ నిబంధనల రూపంలో తగిలిన ఎదురుదెబ్బను వూహించలేకపోయాడు. అప్పటి నిబంధనల ప్రకారం అమెరికాలో స్టార్టప్‌ని పెట్టాలంటే కనీసం ఏడేళ్లు అక్కడి సంస్థల్లో పనిచేయాలి. దాంతో చేసేదేమీ లేక మొదట ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగిగా చేరాడు.
కెరీర్లో ఒక్కో మెట్టూ ఎదుగుతున్నా, తన నైపుణ్యాలని వేరెవరి కోసమో ధారపోస్తున్నాననే బాధ బన్సల్‌ను వేధిస్తుండేది. అయినా నిరుత్సాహపడకుండా ఉద్యోగం చేస్తూనే రాత్రుళ్లు తాను పెట్టబోయే కంపెనీ కోసం సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లు రాసుకునేవాడు. ఏడేళ్ల తరవాత గ్రీన్‌ కార్డు చేతిలో పడ్డ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి కంపెనీ కలను నిజం చేసుకునే పనిలో పడ్డాడు.

బుర్ర నిండా ప్రణాళికలున్నా వాటిని ఆచరణలో పెట్టడానికి బన్సల్‌ దగ్గర డబ్బులేదు. దాంతో పెట్టుబడుల కోసం సిలికాన్‌ వ్యాలీలో దాదాపు పాతిక వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల చుట్టూ తిరిగాడు. చివరికి ఒకే ఒక్క సంస్థ స్పందించి, స్టార్టప్‌కి నిధులు సమకూర్చడానికి ముందుకొచ్చింది. అలా ఎనిమిదేళ్ల క్రితం అమెరికాలో ‘ఆప్‌ డైనమిక్స్‌’ సంస్థకు బన్సల్‌ ప్రాణం పోశాడు. తొలి ఉద్యోగిగా సాఫ్ట్‌వేర్‌ నిపుణుడైన తన స్నేహితుడు సుంకర భాస్కర్‌ని సంస్థలోకి ఆహ్వానించాడు.

ప్రపంచంలో దాదాపు ఓ మోస్తరు సంస్థలన్నింటికీ మొబైల్‌ అప్లికేషన్లుంటాయి. వ్యాపార మనుగడకూ, వినియోగదారులకి చేరువయ్యేందుకూ ఆప్‌లే కీలకం. కానీ అన్ని సంస్థలకూ పెరుగుతున్న వినియోగదారులకు అనుగుణంగా వాటిని నిర్వహించేంత సామర్థ్యం ఉండదు. ఆ డిమాండ్‌ని తట్టుకొని నిలబడలేకపోతే చాలా వ్యాపారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వ్యాపారులకు ఆ కష్టం రాకుండా, తమ క్లౌడ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆప్‌లు సవ్యంగా, వేగంగా పనిచేసేలా చూసే సంస్థే ‘ఆప్‌ డైనమిక్స్‌’. ప్రారంభమైన ఏడాది తరవాత తొలి క్లయింట్‌ని సంపాదించిన ‘ఆప్‌ డైనమిక్స్‌’, రెండు వేలకు పైగా ప్రముఖ కంపెనీలకు సేవలందిస్తోంది. నైకీ, నెట్‌ఫ్లిక్స్‌, హెచ్‌బీవో లాంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి.
మెరుగైన సేవలతో క్లయింట్ల సంఖ్యతో పాటు మార్కెట్లో తమ స్థాయినీ పెంచుకుంటూ వెళ్లిన బన్సల్‌, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా సేవలందిస్తున్న స్నేహితుడు భాస్కర్‌ సాయంతో దాని మార్కెట్‌ విలువను గతేడాది పదివేల కోట్ల రూపాయల మార్కు దాటించాడు. సంస్థ గాడిలో పడ్డాక డేవిడ్‌ వాద్వాని అనే అనుభవజ్ఞుడికి సీయీవో బాధ్యతలు అప్పగించి తాను ఛైర్మన్‌గా కొనసాగుతున్నాడు. తనలా స్టార్టప్‌లు పెట్టాలనుకున్న కుర్రాళ్లను ప్రోత్సహించేందుకు మెంటార్‌గా మారి మొదట ‘మైండ్‌ టికిల్‌’ అనే భారతీయ స్టార్టప్‌కి దాదాపు 85కోట్ల రూపాయల పెట్టుబడిని సమకూర్చిపెట్టాడు.
‘ఆప్‌ డైనమిక్స్‌’ దూసుకెళ్తున్న సమయంలో సంస్థ షేర్లను అమ్మకానికి పెట్టాలని బన్సల్‌ నిర్ణయించుకున్నాడు. కానీ క్లయింట్లలో ఒకటైన ‘సిస్కో’ ఏకంగా 3.7బిలియన్‌ డాలర్ల(రూ.25వేల కోట్లు)కు దాన్ని చేజిక్కించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అలా ఎనిమిదేళ్ల క్రితం చేతిలో రూపాయి లేకుండా బన్సల్‌ మొదలుపెట్టిన ‘ఆప్‌ డైనమిక్స్‌’ ఈ మధ్యకాలంలో అత్యధిక మొత్తానికి అమ్ముడైన భారతీయుడి సంస్థగా గుర్తింపు పొందింది.
అంత భారీ సంస్థను నడిపిస్తున్నా, వ్యక్తిగత సంతోషాల్ని ఏరోజూ పక్కనపెట్టలేదంటాడు బన్సల్‌. గతేడాది భార్యతో కలిసి భూటాన్‌ ట్రెక్కింగ్‌కి వెళ్లి, ఆపైన ఆఫ్రికాలో సఫారీ పర్యటన చేశాడు. కేవలం రకరకాల వంటకాల రుచి చూడటానికే కోపెన్‌హగన్‌, ఓస్లో, మెక్సికో లాంటి ప్రాంతాల్లో తిరిగాడు. ఇప్పటిదాకా 30 సాఫ్ట్‌వేర్ల పేటెంట్లనూ తన పేరు మీద నమోదు చేసుకున్నాడు.
మరి కొన్ని కంపెనీల్ని మొదలుపెట్టడానికే సంస్థను అమ్మేశానని చెప్పే బన్సల్‌, తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ని త్వరలో భారత్‌లోనే మొదలుపెట్టనున్నాడు. సంస్థను అక్కడ అమ్మేసినా ఆ డబ్బుని మన దేశంలో పెట్టుబడిగా పెట్టడం మనకూ మంచిదే..!

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...