వారానికి ఒక్కసారైనా 1km చెప్పుల్లేకుండా నడవాలి.. ఎందుకో తెలుసా?!

వారానికి ఒక్కసారైనా 1km చెప్పుల్లేకుండా నడవాలి.. ఎందుకో తెలుసా?!

kumar, 19/02/2017.




ఇంట్లో మొత్తం నున్నని పాలిష్ బండలు, ఇంకా స్మూతైన చెప్పులు.. ఎక్కడా పాదాలకు గరుకు తగిలేది లేదు. ఇది ఏమాత్రం ఒంటికి మంచిది కాదని చాలా మందికి తెలియదు. మన పూర్వీకులు నిరంతరం గతుకుల రోడ్లల్లో, పొలం గట్ల వెంబడి చెప్పుల్లేకుండా తిరగడం మూలాన ఎంతో యాక్టివ్ నెస్ ఉండేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. స్లయిల్ పేరుతో బెడ్ రూం లోకి కూడా చెప్పులొచ్చేశాయ్.. ఉదయం మంచం దిగింది మొదలు మళ్లీ రాత్రి బెడ్ ఎక్కే వరకు కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు…. వీలైతే స్లిప్పర్లు, లేకుంటే శాండిల్స్… కాకుంటే స్పోర్ట్స్ షూస్.. ఇంకా అయితే ఫార్మల్ షూస్…ఇలా టైమ్ ను బట్టి ఏదో ఓ పాదరక్షలను బిగించి మరీ మన పాదాల్ని కప్పేస్తున్నాం. ఇలాచేసి పాదాలను రక్షిస్తున్నామని అనుకుంటున్నాం గాని శరీరానికి శిక్ష వేసుకుంటున్నామని చాలామందికి తెలియదు. ఇప్పటి నుంచైనా ఇక మీదట వారానికోసారైనా ఒక కిలోమీటర్ దూరం చెప్పుల్లేకుండా నడిచే ప్రయత్నం చేయండి లేకుంటే మీ ఆరోగ్యం డేంజర్ లో పడుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. నడవడం మూలాన ప్రయోజనాలేమిటంటే..

ఇవీ ప్రయోజనాలు:
* మన పాదాల్లో 72వేల నరాల కొనలు ఉంటాయి. ఎక్కువసేపు పాదరక్షలు వాడటం వల్ల సున్నితమైన ఈ నరాలు చచ్చుబడిపోతాయి. చెప్పుల్లేకుండా నడవడం వల్ల అవి యాక్టివ్ గా  ఉంటాయ్.
* శరీర స్ట్రక్చర్ సరిగ్గా ఉంటుంది.
* రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. బీపీ నార్మల్ లో ఉంటుంది.
* పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుంది.
* నేల మీద చెప్పులు లేకుండా నడవడం ద్వారా ఇసుక, చిన్న చిన్న రాళ్లు కాళ్లకు సుతిమెత్తగా కుచ్చుకుని శరీరం హాయి అనుభూతి పొందుతుంది.
* ఏదో కొత్త స్పర్శను కాలి పాదాలు పొందడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది.సహనం పెరుగుతుంది.
* ఇక నుంచైనా పార్క్ లు, బీచ్ లు, ఆపీస్ లు, ఇంట్లో….చెప్పుల్లేకుండా నడిచే అలవాటును అలవర్చుకోండి. ఆరోగ్యంగా ఉంటారు..

No comments:

Post a Comment

Jaanu (2020) HDRip Telugu Full Movie downloads

Jaanu (2020) HDRip Telugu Full Movie Watch Online Free Posted by  Ivan  on  Mar 12, 2020   DVDRip ,  Featured ,  Movierulz Today ,  Tel...