ఒక్క జామకాయ 10 ఆపిల్స్ తో సమానం!! తింటే ఏం జరుగుతుందంటే..
kumar,16/02/2017.
పెరటి మొక్క వైద్యానికి పనికిరాద
జరుగుతుందంటే..
పెరటి మొక్క వైద్యానికి పనికిరాదని సామెత.. అలాగే మనకు విరివిగా దొరికే జామకాయను చాలా లైట్ తీసుకుంటాం.. అదే ఆపిల్ అయితే ఎంత రేటైనా కొనుక్కుని తింటాం.. కానీ పది ఆపిల్స్ తినడం కంటే ఒక్క జామకాయ తినడం బెస్ట్ అంటారు పోషకాహారనిపుణులు. ఆపిల్‌తో పోలిస్తే జామపండులోనే పోషకాలు మెండుగా ఉంటాయని వెల్లడిస్తున్నారు. జామ కాయని తింటూ ఉంటే వ్యాధి నిరోధక శక్తి అమాంతం పెరుగుతుందట. ఇది జామ సీజన్ కాబట్టి వెంటనే తినే అవకాశం సైతం ఉంది. జామకాయ ప్రత్యేకతలు కింద చూద్దాం..
అందుకే జామకాయ ఎంతో ప్రత్యేకం:
* కమలా పండ్లతో పోల్చితే జామపండులో ఐదు రెట్లు అధికంగా విటమిన్-సి ఉంటుంది.
* 1కిలో ఆకుకూరలో కంటే రెండింతల పీచుపదార్థం 1కిలో జామపండ్లలో లభిస్తుంది.
* అంతేకాదు జామలో కొవ్వు, కేలరీలు తక్కువ. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.
* జామ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, పేగులను శుభ్రపరుస్తుంది.
* జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచుపదార్థం మెండుగా ఉన్నాయి. మధుమేహం ఉన్నవారూ తినవచ్చు.
* జామకాయలో ఉండే పీచుపదార్థం వల్ల మలబద్దకం దూరమవుతుంది.
* రోగనిరోధకశక్తిని పెంపొందించే విటమిన్ సి జామలో అధిక మోతాదులో ఉంటుంది. ఇది నారింజ పండ్లలో దొరికే దానికన్నా నాలుగురెట్లు ఎక్కువ.
* ఇందులో ఉండే మెగ్నీషియం ఆందోళనను దూరం చేస్తుంది.
* విటమిన్ ఎ అధిక మోతాదులో ఉండడం వల్ల దృష్టిలోపాలు దూరమవుతాయి.
* జామలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్లు, ఫ్లవనాయిడ్లు, బీటాకెరొటిన్, ల్యూటిన్లు క్యాన్సర్ కారకాలు, కణతులు వ్యాప్తి చెందకుండా కాపాడతాయి.
* లోపల ఎర్రగా ఉండే జామకాయలు క్యాన్సర్ నివారణలో మరింత తోడ్పడతాయి.
* వీటిలో ఉండే ఫైబర్లు డయాబెటిక్ నివారణకు తోడ్పడతాయి.
* శరీరంలో సోడియం, పొటాషియం పరిమాణాన్ని సమపాళ్లలో ఉంచి రక్తపోటు అదుపులో ఉండేందుకు ఉపయోగపడుతుంది.

No comments:
Post a Comment